Stock Market: ఫ్లాట్ గా ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..! 10 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ మధుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ 52 పాయింట్లు పెరిగి 78,584 వద్ద ట్రేడ్ అవుతుండగా .. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 23,765 వద్ద కొనసాగుతుంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 85.14 వద్ద ఉంది.